Monday, January 20, 2025

సిజెఐ కోర్టులో ఆడియో చిక్కులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిజై డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కోర్టు శుక్రవారం కేసులను వర్చువల్‌గా విచారణ చేస్తున్న సమయంలో ఆడియో అంతరాయాలు ఎదురయ్యాయని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చెందిన సాంకేతిక బృందం ఈ సమస్యను పరిష్కరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతరాయం కారణంగా కొంత సేపు పలువురు లాయర్లు,కక్షిదార్లు, జర్నలిస్టులు విచారణకు హాజరు కాకపోవడమో లేదా విచారణలను వినలేకపోవడమో జరిగింది. సుప్రీంకోర్టు భౌతిక విచారణలతో పాటుగా లాయర్లు , ఇతరులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరుకావడానికి అనుమతించిన విషయం తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News