Wednesday, January 22, 2025

భారత్, సింగపూర్ సుప్రీంకోర్టుల మధ్య అవగాహనా ఒప్పందం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సింగపూర్‌లో న్యాయ సహకారానికి సంబంధించి భారత్, సింగపూర్ దేశాలు గురువారం ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేశ్ మీనన్‌ల సమక్షంలో ఇరు దేశాల సుప్రీంకోర్టుల మధ్య ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. చంద్రచూడ్ సింగపూర్‌లో అధికారిక పర్యటనలో ఉన్నట్లు సుప్రీంకోర్టు అధికారి ఒకరు చెప్పారు. గతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాక, సుప్రీంకోర్టు బెంచ్‌లో కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News