Sunday, December 22, 2024

వర్చువల్ విచారణ కాదనరాదు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏ హైకోర్టు కూడా వర్చువల్ కోర్టు విచారణలను కాదన రాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. నిర్ధేశితంగా వర్చువల్ , రెండు ప్రక్రియల మిశ్రిత విచారణలు అవసరం అనుకుంటే వీటిని నిర్వహించాల్సిందే ఇందుకు అవసరం అయిన విధంగా ఇంటర్నెట్ సౌకర్యాలు. వైఫై వంటివి ఏర్పాటు చేసుకోవల్సిందే అని సుప్రీంకోర్టు తెలిపింది. వీటికి సంబంధించి న్యాయవాదులు, కక్షిదార్లపై ఎటువంటి ఖర్చుల భారం మోపరాదని, ఇటువంటి విచారణలలో వారికి ఉచిత ఏర్పాట్లు ఉండాలని తెలిపారు.

ఇటీవలి కాలంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో పూర్తి స్థాయిలో ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియల విచారణ ఎత్తివేశారని ఓ పిటిషనర్ తెలియచేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. సంబంధిత విషయంపై అన్ని హైకోర్టులు, ట్రిబ్యునల్స్‌కు నోటీసులు వెలువరించింది. న్యాయస్థానాలలో వర్చువల్ విచారణలకు తగు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కేంద్ర ఐటి మంత్రిత్వశాఖపై ఉందని కూడా చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News