Wednesday, December 25, 2024

శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ ఎన్వీ రమణ దంపతులు..

- Advertisement -
- Advertisement -

తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు జస్టిస్ యుయు లిలత్, ఎపి హైకోర్టు సిజె పికె మిశ్రా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు హరీశ్ రావు, గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, రంగనాథరాజులు కూడా తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉదయం 9 గంటలకు సర్వరథంపై భక్తులకు శ్రేదేవి భూదేవి సహిత మలయప్పస్వామి దర్వనమివ్వనున్నారు.

CJI NV Ramana Couple visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News