Wednesday, January 22, 2025

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana Family Visits Tirumala

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జస్టిస్ రమణకు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపం లో వేద ఆశీర్వచనం అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్, టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు పాల్గొన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News