Friday, November 15, 2024

శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana praise in thousand pillars temple

మన తెలంగాణ/వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో రెండు రోజుల ప ర్యటనకు విచ్చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ దంపతు లు, ఇతర న్యాయమూర్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చారిత్ర క ఆలయాలను సందర్శించారు. శనివారం సాయంత్రం వరంగల్‌కు చే రుకున్న జస్టీస్ ఎన్‌వీ రమణ, ఇతర న్యాయమూర్తులు ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి వెళ్లి సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ శిల్పకళా వైభవాన్ని సందర్శించారు. రాత్రి హన్మకొండ జిల్లాలోని నిట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న న్యాయమూర్తులు అక్కడే బస చేశారు.
ఉదయం శ్రీభద్రకాళి దేవస్థానంలో పూజలు
ఆదివారం ఉదయం జస్టీస్ ఎన్‌వీ రమణ తెలుగుతనం ఉట్టిపటేలా పం చకట్టు ధరించి సతీసమేతంగా వరంగల్‌లోని చారిత్రక శ్రీభద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖాధికారులు న్యాయమూర్తులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోపట ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత న్యాయమూర్తులందరిని అర్చకులు, అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అక్కడి నుండి హన్మకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల దేవాలయానికి న్యాయమూర్తుల దం పతులు చేరుకున్నారు. అక్కడ జస్టీస్ ఎన్‌వీ రమణ దంపతులు, హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సతీష్‌చంద్రశర్మ దంపతులు, మరో ప దిమంది హైకోర్టు న్యాయమూర్తులు పూజలు నిర్వహించారు. జస్టీస్ ఎన్‌వీ రమణ దంపతులు రుద్రేశ్వరునికి గర్భగుడిలో అభిషేకం నిర్వహించారు. అధికారులు ఆలయ నిర్మాణాన్ని, ప్రాశస్తాన్ని న్యాయమూర్తులకు వివరించారు. అక్కడి నుండి నిట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన న్యాయమూర్తులు హన్మకొండలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలోని నూతన భవన నిర్మాణం వద్దకు చేరుకున్నారు.
సుదీర్ఘ సమయం వెచ్చించిన జస్టీస్ ఎన్‌వీ రమణ
వరంగల్ కోర్టు భవన ప్రారంభోత్సవానికి ఆదివారం ఉదయం 11 గం టలకు చేరుకున్న జస్టీస్ ఎన్‌వీ రమణ సుమారు నాలుగు గంటల పా టు కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండడం విశేషం. టెన్‌కోర్టు బి ల్డింగ్‌తోపాటు ఫోక్సో కోర్టు, అన్నపూర్ణ క్యాంటీన్, ఇతర ఆధునీకరణ సౌకర్యాలను ప్రారంభించిన తరువాత సమావేశంలో మాట్లాడిన అనంతరం సుమారు రెండు గంటల పాటు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ బాధ్యులు, తనను కలవడానికి వచ్చిన వారందరికి సమయం ఇచ్చి వారితో ఫొటోలు దిగడం విశేషం. సుమారు రెండు గంటల పాటు న్యాయవాదులతో ఆయన మమేకమయ్యారు. అనంతరం అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలివెళ్లారు..
పటిష్టమైన బందోబస్తు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వీ రమణ రెండు రోజుల వరంగల్ పర్యటనకు వరంగల్ సిపి తరుణజోషి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డిసిపిలు, పదిమంది డిఎస్‌పిలు, సిఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిపి త రుణ్‌జోషి, డిసిపి పుష్పారెడ్డి, సాయిచైతన్యలు పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News