Sunday, December 22, 2024

శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana Visits Tirumala Temple

తిరుమల: సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సీజేఐ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత, సుందరీకరణకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో కరోనా లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించామని ఎన్వీ రమణ తెలిపారు. శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతీ దేవిని ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించి, తర్వాత సన్నిధిలోని అమ్మవారి మూలవర్లను దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News