Thursday, November 14, 2024

సుప్రీంకోర్టులో ‘నవ’శకం

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana was sworn in for first time

 

ఒకే రోజు 9 మంది న్యాయమూర్తులు
ప్రమాణస్వీకారం చేయించిన సిజెఐ ఎన్‌వి.రమణ తొలిసారి
ప్రత్యేక్ష ప్రసారం నాలుగుకు చేరిన మహిళా జడ్జీల సంఖ్య
ప్రమాణ స్వీకారం చేసిన హిమాకోహ్లి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మంగళవారంనాడు చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో తొలిసారి ఒకే రోజు 9మంది న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో ప్రధానన్యాయమూర్తితో కలిపి జడ్జిల సంఖ్య 33కు చేరినట్లయింది. సుప్రీంకోర్టు అదనపు భవంతిలోని ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సిజెఐ ఎన్‌వి రమణ తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తుల చేత ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బిఎం త్రివేది, జస్టిస్ పిఎస్ నారసింహ ఉన్నారు.

వీరిలో జస్టిస్ బివి నాగరత్న మాజీ సిజెఐ ఇఎస్ వెంకట్రామయ్య కూతురు. 2027 సెప్టెంబర్ లో జస్టిస్ నాగరత్న భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించే అవకాశాలున్నాయి. ఆమెతో పాటు జస్టిస్ నాథ్, నారసింహ కూడా సిజెఐ పదవిని అధిష్టంచనున్నారు. సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సిజెఐ కోర్టు రూమ్.1లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరమున్నందున వేదికను ఆడిటోరియానికి మార్చారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యమ్రాన్ని తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతకుముందు జడ్జిల నియామకానికి కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపిన సందేశాన్ని చదివి వినిపించారు.

నాలుగుకు చేరిన మహిళా జడ్జిలు…

1950, జనవరి 26 నుంచి దేశ ప్రజలకు న్యాయసేవలందిస్తున్న సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు అంటే 71 ఏళ్ల చరిత్రలో కేవలం 8మంది మాత్రమే మహిళా జడ్జిలు నియమితులయ్యారు. మొట్టమొదటి మహిళా జడ్జిగా ఎం.ఫాతిమా బీవి 1989లో సేవలందించారు. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ మాత్రమే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆమె 2018 ఆగస్టులో మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. తాజాగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లి, బిఎం త్రివేది సుప్రీం జడ్జిలుగా ప్రమాణం చేయడంతో వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇదిలా ఉండగా హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టు జడ్జిల రిటైర్మెంట్ వయసు 65.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News