Sunday, December 22, 2024

ఒకరోజు ఈ బెంచ్‌లో కూర్చోండి.. పారిపోతారు: సిజెఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘మీరు ఒక రోజు ఇక్కడ కూర్చోండి. భరించలేక మీరు పారిపోతారని నేను మీకు భరోసా ఇస్తున్నా’. శివసేన ఎంఎల్‌ఎల అనర్హతకు సంబంధించిన ఒక కేసులో సత్వర విచారణకు పట్టుబట్టుతున్న ఒక న్యాయవాది తీరుతో చిరాకు పడిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ అన్న మాటలు అవి. మహారాష్ట్ర రాజకీయ వివాదాలకు సంబంధించిన రెండు వేర్వేరు పిటిషన్ల విచారణకు తేదీలను సిజెఐ, న్యాయమూర్తులు జెబి పర్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిర్ధారిస్తున్నది.

2022 జూన్‌లో శివసేన చీలిక అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ‘అసలైన రాజకీయ పార్టీ’గా ప్రకటిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఇచ్చిన ఉత్తర్వును ఉద్ధవ్ థాక్కరే వర్గంసవాల్ చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్ని అసలైన ఎన్‌సిపిగా నర్వేకర్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎన్‌సిపిలోని శరద్ పవార్ వర్గం మరొక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై స్పందనకు అజిత్ పవార్ వర్గానికి, దాని 40 మంది ఎంఎల్‌ఎలకు కోర్టు పది రోజుల సమయం ఇచ్చింది.

ఈ లోగా ఉద్ధవ్ థాక్కరే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది తమ పిటిషన్ విచారణకు త్వరగా తేదీ నిర్ణయించాలని అదేపనిగా కోరసాగారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున దీనిపై త్వరగా విచారించాలని ఆయన కోరారు. ‘కోర్టుకు ఆదేశాలు జారీ చేయకండి’ అని సిజెఐ అన్నారు. ‘మీరు ఒక్క రోజు కోసం ఇక్కడికి వచ్చి కూర్చుని, మీరు కోరుకునే తేదీలు ఏవో కోర్టు మాస్టర్‌తో చెప్పండి. చివరకు ఇది మరీ దుర్భరం అని మీరు గ్రహిస్తారు. కోర్టులు ఎటువంటి పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో మీరు చూస్తారు& దయచేసి వచ్చి, ఇక్కడ కూర్చోండి. ఒక రోజు కూర్చోండి. మీరు భరించలేక పారిపోతారని మీకు హామీ ఇస్తున్నా’ అని సిజెఐ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News