- Advertisement -
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల చలో ఢిల్లీతో తలెత్తిన ట్రాఫిక్ జాం సమస్యలపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పందించారు. లాయర్లు ఎవరైనా ట్రాఫిక్ జాంలో చిక్కుపడి ఆలస్యంగా వస్తే వారి పట్ల సర్దుబాట్లతోనే ఉంటామని తెలిపారు. రైతుల ఆందోళన యాత్రతో మంగళవారం ఢిల్లీ వీధులలో అసాధారణ రీతిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సర్దుబాట్లు తప్పవని ఆయన స్పందించారు. మంగళవారం ఓ కేసు విచారణ దశలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని ప్రస్తావించింది. కొన్ని సందర్భాలలో ఎవరైనా సకాలంలో గమ్యస్థానం చేరుకోలేని పరిస్థితి ఉంటుంది. దీనిని అర్థం చేసుకుని సాగాల్సిందే అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
- Advertisement -