Thursday, January 23, 2025

సిజెఐ యూయూ లలిత్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ను వారసుడిగా ప్రకటించారు

- Advertisement -
- Advertisement -

Lalit recommends Chandrachud

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఉదయ్ ఉమేశ్ లలిత్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ని  అతని వారసుడిగా  సిఫారసు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ 74 రోజుల పదవీకాలం తర్వాత నవంబర్ 8న పదవీ విరమణ చేయబోతున్నారు. కాగా మంగళవారం నాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరి సమావేశంలో జస్టిస్ చంద్రచూడ్‌ను 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా అధికారికంగా నియమించారు. అతని పదవీకాలం రెండేళ్లు ఉంటుంది,  అతను నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ చంద్రచూడ్ పేరును సిఫారసు చేస్తూ ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ చంద్రచూడ్‌ను నియమించారు.  భారత ప్రధాన న్యాయమూర్తి తన వారసుడిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిని పేర్కొనడం రివాజు.

మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం, పదవీ విరమణకు ఒక నెల ముందు, వారసుడి పేరు తెలుపమని పదవి నుంచి దిగిపోయే భారత ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం అడుగుతుంది. అక్టోబరు 7న న్యాయ, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తన వారసుడి నియామకానికి సంబంధించిన సిఫార్సులను పంపాలంటూ సిజెఐకి లేఖ పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News