Monday, December 23, 2024

పెండింగ్ కేసులపై సిజెఐ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana speech at NRI Meeting in New York

జైపూర్ : కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేశారు. జైపూర్‌లో జరిగిన అఖిల భారత న్యాయసేవల అథారిటీస్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేవనెత్తిన అంశాలకు జస్టిస్ రమణ బదులిచ్చారు. న్యాయశాఖ మంత్రి ప్రస్తావించిన అంశాలపై స్పందించడం తన బాధ్యతని పేర్కొన్న జస్టిస్ రమణ పెండింగ్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. న్యాయమూర్తులుగా తాము విదేశాలకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటారని, ఓ కేసును పరిష్కరించేందుకు ఎన్నేళ్ల సమయం పడుతుందని అడుగుతుంటారని చెప్పుకొచ్చారు.

పెండింగ్ కేసులకు కారణమేమిటో మీ అందరికీ తెలుసని , దానిపై తాను సవివరింగా చెప్పాల్సిన పనిలేదన్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టక పోవడంతో పాటు జ్యుడీషియల్ మౌలిక వసతులను మెరుగుపర్చకపోవడమే పెండింగ్ కేసులు పేరుకుపోడానికి కారణమని స్పష్టం చేశారు. ఇదే విషయం తాను గతంలో ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సమావేశంలోనూ తేల్చి చెప్పాన్నారు. ఈ అంశాలను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థ శ్రమిస్తోందని, ప్రభుత్వం ఖాళీల భర్తీ, కోర్టుల్లో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ఏర్పాటు చేయాలని తాము సూచించామని , అయితే ఈ ప్రతిపాదన ఇంకా కార్య రూపం దాల్చలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News