Wednesday, January 22, 2025

జానీ మాస్టర్ వివాదంపై అప్పుడే క్లారిటీ

- Advertisement -
- Advertisement -

కొరియెగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ఝాన్సీ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల ఈ కార్యకమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ “పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత బాధితురాలు ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. అప్పటి దాకా కాస్త సంయమనం పాటించాలి. ప్రభుత్వం తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ నిమిత్తం సరైన గైడ్‌లైన్స్ లేవు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఒక కమిటీ ఫామ్ అయింది. అప్పటి నుంచి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉన్నాం.

జానీ మాస్టర్ వివాదం రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. మేమే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరాము. పోలీసుల విచారణ, మా విచారణ సమాంతరంగా జరుగుతుంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను, జానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాం. 90 రోజుల లోపే దీనిపై క్లారిటీ వస్తుంది”అని అన్నారు. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఆదేశించాము. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఫిర్యాదు చేయాలి. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంప్లైట్ బాక్స్ అందుబాటులో ఉంటుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News