పుష్ప- 2’ సినిమా విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్-, దర్శకుడు సుకుమార్‌పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “పుష్ప- 2 గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూసి నవ్వుకుంటున్నాము. అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ 15 నుంచి 20 రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని, ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందామని అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గడ్డం ట్రిమ్ చేశారు. అల్లు అర్జున్, సుకుమార్, నాకు ఉన్న బాండింగ్ లైఫ్‌లాంగ్ అలానే వుంటుంది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలింని ఎవరూ సింపుల్‌గా తీసుకోకూడదు” అని అన్నారు.
‘పుష్ప-2’ రూమర్స్‌పై క్లారిటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -