Tuesday, September 17, 2024

బల్కంపేటలో తోపులాట: అధికారులపై మంత్రి పొన్నం అసహనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అమీర్‌పేట: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో వేదిక వద్ద తోపులాట చోటుచేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిలు ఆలయం వద్దకు వస్తుండగా ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. భారీ కేడ్ల కోసం ఏర్పాటు చేసిన రాడ్ తగిలి పొన్నం, విజయలక్ష్మితూలి క్రింద పడిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వెలుపల డివైడర్‌పై కూర్చొని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంత్రి పొన్నం, మేయర్‌ను బ్రతిమిలాడి లోనికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో ప్రోటోకాల్ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్టు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు తీవ్ర అసహనం వ్యక్తం చేసి అలిగారు. అనంతరం ఆలయం బయట కూర్చుండిపోయారు. ఈ క్రమంలో అధికారులపై అసహనం, కోపంతో మంత్రి ఊగి పోయారనే టాక్ కూడా నడిచింది. అయితే అసలేం జరిగిందనే దానిపై మంత్రి, మేయర్ ఇద్దరు ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.

అలాంటిదేమీ లేదు: మంత్రి పొన్నం
తాను అలిగినట్టు వస్తున్న వార్తలను మంత్రి పొన్నం ఖండించారు. నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. మేయర్ విజయలక్ష్మి కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారు. తోపులాటను నిలువరించేందుకు కొద్దిసేపు ఆగి అధికారులతో మాట్లాడాం, తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించినట్టు చెప్పారు. అమ్మవారి భక్తులం ఎందుకు ఆలుగుతాం… మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు పునఃరావృతం కాకుండా చూస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఇదే ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా స్పందించారు. మా ప్రభుత్వంలో మేము ఎందుకు అలుగుతామని ఆమె అన్నారు.

తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారని బయట ఆగాము. అధికారులతో మాట్లాడి భక్తుల రాకపోకలను క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకున్నాం. అమ్మవారి ముందు అలగడం ఉండదని విజయలక్ష్మి ఘటనపై వివరణ ఇచ్చారు. కాగా తోపులాటలో మేయర్‌కు గాయాలు కూడా అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో ఇలా వేరువేరుగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుక సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించి ఇందులో కుట్ర కోణం దాగి ఉందని అన్నారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా వివాదాలను సృష్టిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News