Monday, December 23, 2024

హైదరాబాద్ నుంచి వాళ్లను వెళ్లమనడం సరికాదు: పవన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్యాబ్ లను హైదరాబాద్ లో నడవనివ్వమని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు గొడవకు దిగారు. దీంతో మంగళగిరిలో జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఎపి క్యాబ్ డ్రైవర్లు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎపి క్యాబ్ డ్రైవర్లకు పవన్ ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ వదిలి వెళ్లమని చెప్పడం అన్యాయమని, అభివృద్ధి జరగాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఐక్యత అవసరమని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ వదిలి వెళ్లమనడం సరైన నిర్ణయం కాదు అని,  ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లపై తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు సానుభూతి చూపించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఇదా చాలా సున్నితమైన అంశమని రెండు వేల కుటుంబాలను ఆవేదన చెందుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని ఆంధ్రా క్యాబ్ డ్రైవర్లకు పవన్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News