Wednesday, January 22, 2025

రూ. 20 వేల కోసం అన్న వదినను చెట్టుకు కట్టేసిన కొట్టిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

అన్నదమ్ముల మధ్య గొడవ చిలికి చిలికి గాలివాన అయినట్లు రూ.20 వేల కోసం తమ్ముడు అన్న , వదినలను చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్‌పురలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాసర్‌పురలో నివాసముంటున్న పరుశరాములు తన తమ్ముడు కనకయ్య దగ్గర రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు.

పరుశరాములు అసలు డబ్బులు లక్ష చెల్లించగా, వడ్డీ డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అన్న వదినలను తమ్ముడు గుడి ప్రాంగణంలో విచక్షణరహితంగా చెట్టుకు కట్టేసి కొట్టాడు. చుట్టుపక్కల ఉన్నవారు కట్లు విప్పడంతో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News