Wednesday, January 22, 2025

మునుగోడులో కాంగ్రెస్, బిజెపి వర్గాల ఘర్షణ

- Advertisement -
- Advertisement -

పాల్వాయి స్రవంతి కాన్వాయిపై దాడి

2022 Indian presidential election

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో ఆదివారం కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిపై కాన్వాయిపై దాడి జరిగింది. బిజెపికి చెందిన వారే తమ కాన్వాయిలోని వాహనంపై దాడి చేశారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. తమ కాన్వాయిలోని వాహనం ప్రచారానికి వెళ్లే సమయంలో దారి ఇవ్వకుండా అడ్డుకున్నారని బిజెపిపై ఆరోపణలు చేసింది. నాంపల్లికి సమీపంలో తమ కార్యకర్తలు తమ వాహనానికి అడ్డుపడుతున్న బిజెపి వాహనాన్ని నిలిపివేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించిన సమయంలో అసభ్యంగా తమవారిని దూషించడమే కాకుండా తమ వారిపై దాడి చేశారన్నారు. తమ వాహనంలో మహిళ కార్యకర్త, వీడియో గ్రాఫర్, డ్రైవర్ లు ఉన్నారని చెప్పారు. తమ వారిపై దాడి చేసింది బిజెపి కార్యకర్తలేనన్నారు. దాడికి దిగిన బిజెపి కార్యకర్తలు స్థానికులు కాదని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడికి సంబంధించిన విషయమై జిల్లా ఎస్‌ఫికి పిర్యాదు చేసినట్టుగా చెప్పారు. దాడి సమయంలో తీసిన దృశ్యాలను కూడ ఎస్‌పికి పంపామన్నారు. తమతో ఉద్దేశ్యపూర్వకంగానే బిజెపి కార్యకర్తలు గొడవకు దిగారని ఆరోపించారు.

పాల్వాయి స్రవంతి ధర్నా

తమ కాన్వాయ్ పై దాడికి దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా వ్యవహరించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. తమ వారిపై దాడి చేసిన వారంతా తమ ముందే వాహనాల్లో తిరుగుతున్నా రన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసుల తీరును ఆమె తప్పుబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News