Sunday, January 19, 2025

పబ్ వర్కర్ల మధ్య గొడవ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

పబ్‌లో పనిచేస్తున్న వర్కర్ల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…రాయదుర్గం పబ్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కృతిక్(23) అదే పబ్‌లో బౌన్సర్‌గా పని చేస్తున్న ఆరిఫ్ మధ్య గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన బౌన్సర్ ఆరిఫ్, కృతిక్‌తో పాటు అతడి అన్న మల్లికార్జున్(24), స్నేహితుడు కళ్యాణ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉండగా కళ్యాణ్‌కు చేతికి, కాలుపై గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన ఆరిఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News