Friday, December 20, 2024

రేవంత్ X కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

స్క్రీనింగ్ కమిటీ భేటీలో మళ్లీ ఇద్దరు నేతల వాగ్యుద్ధం

అభ్యర్థుల ఎంపిక తుది దశలో సీనియర్ల స్థానాల్లో అదనంగా కొత్త పేర్లు చేర్చిన పిసిసి చీఫ్

ఎంపి వెంకట్‌రెడ్డి అభ్యంతరం
మద్దతు పలికిన పలువురు

రాహుల్ వద్దే తేల్చుకుందామంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఎంపికలో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్‌గా కొనసాగింది. ఢిల్లీ వార్ రూమ్‌లో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సీనియర్లు పోటీ చేసే స్థానాల్లో రేవంత్ రెడ్డి కొత్తగా మరో ఇద్దరి పేర్లు చేర్చడంపై ఎంపి కోమటిరెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. టికెట్లు ఎంపిక తుది దశలో కొత్త పేర్లు ఇవ్వడం ఏమిటని? కోమటిరెడ్డి ప్రశ్నించగా తాను రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నానని పార్టీ పరిస్థితులు కేడర్ పరిస్థితి తనకు తెలుసని రేవంత్ సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది.

ఇదే అంశంలో మిగతా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కోమటిరెడ్డికి మద్దతుగా రేవంత్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురి నేతలు మధ్య కొద్ది నిమిషాల పాటు వాగ్వాదం కొనసాగినట్టుగా సమాచారం. చివరికి టికెట్ల ఎంపిక అంశం రాహుల్ గాంధీ వద్దనే తేల్చుకుందామంటూ ఇద్దరు నేతలు సవాల్ విసురుకున్నట్టుగా తెలిసింది. మరోవైపు స్క్రీనింగ్ కమిటీలోకి తాత్కాలికంగా రేవంత్ టీమ్‌కు చెందిన బలరాం నాయక్, షబ్బీర్ అలీ పేర్లు పెట్టినప్పటికీ ఢిల్లీలో ఫైనల్ సమావేశం జరిగే వార్‌రూంలోకి ఆ ఇద్దరు నేతలను అనుమతించక పోవడం చర్చనీయాంశంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News