Sunday, December 22, 2024

రాంచీ ర్యాలీలో కొట్టుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

ఆదివారం జార్ఖండ్‌లో జరిగిన విపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ఘర్షణలు జరిగాయి. సభ కాస్తా హింసాత్మకం అయింది. కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. ఓ వైపు వేదిక నుంచి నేతలు మాట్లాడుతూ ఉండగానే సభా ప్రాంగణం ప్రభాత్ తారా గ్రౌండ్ రణరంగం అయింది. కారణం తెలియలేదు కానీ తగవు ముదిరి ఇరుపార్టీల నడుమ తోపులాటలు, కొట్లాటలకు దారితీసిందని వెల్లడైంది.

పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే లోపునే కొందరికి గాయాలు అయ్యాయి. వేదికపై ఉన్న వారిలో కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో వెలుపల కూడా స్వల్ప తొక్కిసలాటజరిగింది. బీహార్‌లోని ఛత్రా నుంచి వచ్చిన కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు , నేతల మధ్య వివాదం చెలరేగి , చివరికి ఘర్షణకు దారితీసిందని వెల్లడైంది. అయితే వెలుపలివారు ఇక్కడికి చేరుకుని కావాలనే కొట్లాటలకు పరిస్థితిని తీసుకువచ్చారని ఛత్రా కు చెందిన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News