Monday, December 23, 2024

భూ వివాదంలో ఇరువర్గాల మధ్య కొట్లాట

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి : మండల పరిధిలోని రామచంద్రాపురంలో గత కొన్నేళ్ళుగా భూ వివాదం నడుస్తోంది. భూమికి సంబంధించి రైతులకి దారి వివాదం ఏర్పడటంతో గత కొన్నేళ్ళుగా వివాదం కొనసాగుతూనే ఉంది. మధ్యలో పెద్దలు జోక్యం చేసుకొని, సర్దుబాటు చేస్తూనే ఉన్నారు. తిరిగి మరలా మంగళవారం కొంత మంది రైతులు పొలంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా మళ్ళీ దారి వివాదం నెలకొంది.

దీంతో ఇరువురు రైతుల మధ్య ఘర్షణ వాతారణం ఏర్పడి కొట్లాడ జరగటంతో వజ్రాల కేశవరెడ్డి, ఎస్‌కె. రియాజ్ పాషా అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పెనుబల్లి ఏరియా వైద్యశాలలో వారు చికిత్స పొందారు. ఇరువర్గాల రైతులు ఏ ఒక్కరూ కూడా వియం. బంజర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వలేదని పోలీస్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News