Sunday, January 19, 2025

వికారాబాద్ లో కారంపొడి చల్లి కత్తులతో దాడి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా దోమ మండలం బుద్లాపూర్‌లో దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూమి విషయంలో దాయాదులు కారంపొడి చల్లి కత్తులతో దాడి చేసుకున్నారు. హరిశంకర్ అనే కుటుంబీకులు శ్రీనివాస్ కుటుంబంపై దాడి చేశారు. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News