Monday, December 23, 2024

రెండు గ్రూపుల మధ్య ఘర్షణ… బాలుడిని నగ్నంగా ఊరేగించి….

- Advertisement -
- Advertisement -

జోధ్‌పూర్: రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో బాలుడిని మరో గ్రూప్ వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని కూరగాయాల మార్కెట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కూరగాయల మార్కెట్‌లో భువ్‌నేశ్(23) తన షాప్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అస్లామ్(24) అనే యువకుడు వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం కూరగాయల మార్కెట్‌లో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. స్థానికులు సర్ది చెప్పడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గురువారం ఉదయం భువ్‌నేశ్ మార్కెట్‌కు వచ్చి తన షాప్‌ను ఓపెన్ చేశాడు.

Also Read: బాలుడిది నరబలి కాదు.. ఆర్థిక పరమైన హత్య: డిసిపి శ్రీనివాస్ రావు

అదే సమయంలో ఎదురుగా ఉన్న షాపు ముందు అస్లామ్ తన వాహనాన్ని నిలిపాడు. తనకు దారి ఇవ్వాలని అస్లామ్‌ను భువ్‌నేశ్ అడగడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. భువ్‌నేశ్‌పై అస్లామ్ దాడి చేసి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అస్లామ్‌కు తోడుగా వచ్చిన బాలుడి అక్కడే ఉండిపోవడంతో భువ్‌నేశ్ స్థానికులతో కలిసి బాలుడిపై దాడి చేశారు. అనంతరం బాలుడిని నగ్నంగా ఉరేగించారు. ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని నగ్నంగా ఊరిగించినందుకు పోస్కో యాక్ట్ కింది భువ్‌నేశ్‌తో పాటు మరికొందరుపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News