Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్‌లో ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ..ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సోర్ జిల్లాలో రెండు ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి కాల్పులకు దారితీయడంతో ఒక వ్యక్తి మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారని సోమవారం పోలీసులు తెలిపారు. యశోధర్మన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ముల్తాన్‌పురా గ్రామంలో ఈ ఘర్షణ జరిగిందని వారు చెప్పారు. ముస్లిం మతానికి చెందిన రెండు వర్గాలు ఘర్షణ పడి పరస్పరం కాల్పులు జరుపుకున్నట్లు వారు చెప్పారు. ఈ ఘర్షణలలో ఇరువార్గాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు గాయపడగా అందులో ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయాలతోపాటు కత్తపోట్లకు గురైన ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు ఎస్‌పి అభిషేక్ ఆనంద్ విలేకరులకు తెలిపారు. ఒకే గ్రామంలో నివసించే ఈ రెండు వర్గాలు భూ వివాదంపై ఘర్షణ పడినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News