Friday, November 15, 2024

నెత్తురు చిందిన నేల..

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: భూ తగాదాలతో ఆసిఫాబాద్ జిల్లా భగ్గుమంది. ఈ తగాదాలలో ఒక వర్గానికి చెందిన సుమారు 15 మంది మరో వర్గంపై కత్తులు, వేటకొడవళ్లు, కర్రకలతో దాడి చేయగా ఒక మహిళతోపాటు ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం జక్కులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రెబ్బన మండలం జక్కులపల్లి గ్రామంలో తాతముత్తాతల నుంచి మండల బక్కయ్య అనే రైతు తొమ్మిది ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధరణిలో మండల మల్లయ్య అనే రైతు పేరు మీద పట్టాపాస్ పుస్తకం రావడంతో గత సంవత్సరం నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే మండల మల్లయ్య ఆదివారం పొలంలో పత్తి విత్తనాలు వేశాడు. మండల బక్కయ్య కూడా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం అదే పొలంలో పత్తి విత్తనాలు నాటాడు. విషయం తెలుసుకున్న మండల మల్లయ్య కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి కొడవళ్లు, కర్రలు, కత్తులతో దాడులు పరస్పరం దాడులు చేసుకున్నారు.ఈ దాడిలో మండల బక్కయ్య కుమారుడు మండల నర్సయ్య (30), మండల బక్కయ్య చెల్లె గిరిగుల బక్కమ్మ (45), మండల లింగయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా మండల బక్కయ్య, మండల దుర్గయ్య, మండల సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News