Monday, December 23, 2024

ఇద్దరు కార్మికుల మధ్య ఘర్షణ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

శామీర్ పేట: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో సోమవారం దారణం చోటుచేసుకుంది. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేటలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇద్దరు కార్మికుల మధ్య ఘర్షణలో ఒకరు మృతిచెందారు. తోటి కార్మికుడిని మరో కార్మికుడు కత్తితో పొడిచి దారణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న వ్యమసాయ బావిలో పడేశాడు నిందితుడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News