Thursday, January 23, 2025

గ్రామస్థులు పోలీసుల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: మండలం లోని స్తంభంపల్లి గ్రామ శివారు లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలుపు దల చేయాలని గ్రామస్థులు,పోలీసుల ఘర్షణ మధ్య  మైసమ్మ తల్లికి స్తంభంపల్లి గ్రామస్థులు బోనాలు సమర్పించారు. ఆదివారం వెల్గటూర్ మండలం లోని స్తంభంపల్లి గ్రామస్థులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలుపుదల చేయాలని కోరుతూ ముకుమ్మడిగా డప్పు చప్పుల్లతో ఫ్యాక్టరీ నిర్మాణ స్తలానికి చేరుకుని మైసమ్మ తల్లికి బోనాలను సమర్పించారు.

Also Read: బాలికల భద్రతకు సెఫ్టీ క్లబ్ ఏర్పాటు : సిఎస్

నిషేదిత ఆంక్షలు ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తరుణంలో గ్రామస్థులకు,పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మైసమ్మ బోనాల కు మద్దతుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న జిల్లా కాంగ్రెసు అద్యక్షులు లక్ష్మన్ కుమార్‌ను పోలీసులు వారించి వెనకకు పంపించారు. ఉద్రిక్తల మధ్యన చివరకు గ్రామస్థులు బోనాలను మైసమ్మ తల్లి కి సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News