Friday, March 21, 2025

తిరుమలలో భక్తుల మధ్య వాగ్వాదం..గాజు బాటిల్‌తో దాడి

- Advertisement -
- Advertisement -

క్షణికావేశంలో ఓ భక్తుడు మరో ఇద్దరు భక్తులపై గాజు వాటర్ బాటిల్‌తో దాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం తిరుమలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన గోవిందరాజు, హంపయ్య తమ కుటుంబంలోని 13 మందితో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. స్థానిక సీఆర్వో కేంద్రం వద్ద గదుల కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ తన కుమారుడితో కలిసి సీఆర్వో ఆఫీసు వద్దకు చేరుకున్నాడు.

ఈ సందర్భంగా ఓ కుర్చీలో ఉన్న లగేజీని పక్కన పెట్టి బాబును కూర్చోబెట్టడంతో ఇద్దరు భక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన కుమారుడిని తోసేశారనే కోపంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో కార్తికేయ సమీపంలోని గాజు వాటర్ బాటిల్‌తో గోవిందరాజు తలపై కొట్టాడు. పక్కనే ఉన్న హంపయ్యకు కూడా గాజు పెంకులు గుచ్చుకుని గాయాలయ్యాయి. సమీపంలోని భద్రతా సిబ్బంది క్షతగాత్రులను టిటిడే అశ్విని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న తిరుమల టూటౌన్ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి తమ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇరువురినీ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News