Monday, December 23, 2024

కామేపల్లిలో శ్రీరామనవమి వేడుకల్లో ఘర్షణ…

- Advertisement -
- Advertisement -

కామేపల్లి: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా విగ్రహాల ఊరేగింపులో ఘర్షణ చెలరేగింది. మేళతాళాలతో ఒక వర్గం డిజె సౌండ్‌తో ఊరేగింపులో పాల్గొంది. దీంతో మరో వర్గం పాతకక్షల నేపథ్యంలో రాళ్లు రువ్వడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆటో పూర్తి ధ్వంసమైంది. పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News