Thursday, January 23, 2025

కుప్పంలో హైటెన్షన్…..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో శనివారం ఉదయం వైసిపి , టిడిపి శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో వైసిపి కార్యకర్త మణి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కుప్పం వైసిపి అభ్యర్థి భరత్ అక్కడికి చేరుకొని మణిని పరామర్శించారు. టిడిపి కార్యకర్తలపై ఆయన మండిపడ్డారు. కుప్పంలో టిడిపి ఓడిపోతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు వైసిపి శ్రేణులపై దాడలుకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుప్పం నుంచి టిడిపి అభ్యర్థి చంద్రబాబు నాయుడు, వైసిపి అభ్యర్థి భరత్ లు పోటీ చేస్తున్నారు. సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాలలో 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం ఉండడంతో భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News