Monday, April 7, 2025

ఎల్బీ స్టేడియంలో ఘర్షణ.. పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఎల్బీ స్టేడియంలో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన కుస్తీ పోటీల్లో పాతబస్తీకి చెందిన ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదంతో దాడులు చేసుకున్నారు. గెలుపు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగడంతో పరస్పరం కుర్చీలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు భయాందోళనతో స్టేడియం బయటికి పరుగులు తీశారు.

ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News