Thursday, January 23, 2025

ముదిరిన టిడిపి, వైసిపి డిష్యుం…డిష్యుం!

- Advertisement -
- Advertisement -

కర్నూల్: అస్పరి మండలం బిల్లెకల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కూరగాయల వేలం పాట నేపథ్యంలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వెళ్లిన ఆస్పరి సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్పపై  కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

గతంలో వైసిపి కాంట్రాక్టర్ నల్లన్న రూ. 78 లక్షలకు వేలం పాటలో బిల్లేకల్ కూరగాయాల మార్కెట్ దక్కించుకున్నారు. వీరేశ్ అనే రైతు మిరప పంటను విక్రయించేందుకు మార్కెట్ కు వచ్చాడు. వేలం పాట తర్వాత డబ్బులు చెల్లించారు. కాగా డబ్బుల విషయంలో కాంట్రాక్టర్ నల్లన్న, మార్కెట్ నిర్వాహకుడు హనుమంత రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతు వీరేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేలం పాటను నిలిపేయాలని డిమాండ్ చేశాడు. దాంతో మార్కెట్ నిర్వాహకుడు హనుమంత రెడ్డి, రైతు వీరేశ్ లకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలియడంతో వైసిపి కన్వీనర్, టిడిపి మండల మాజీ కన్వీనర్ మార్కెట్ కు చేరుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మార్కెట్ అంతా ఉద్రిక్తంగా ఉంది. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News