ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఓకె)లో ప్రజలకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణ తీవ్రతరం అయింది. ప్రజల దాడి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు తీశారు. దద్యాల్, మీర్పూర్, సమహనీ, సెహన్సా, రావల్ కోట్, ఖుయిరట్టా, టప్పా పానీ, హట్టియాన్ బాలా సహా ఇతర ప్రాంతాలలో కూడా ఘర్షణలు జరుగుతున్నాయి.
పిఓకె ప్రజలు పన్ను రహిత విద్యుత్తు, గోధుమ పిండిపై సబ్సిడీ డిమాండ్ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ షట్టర్ డౌన్, వీల్ జామ్ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళనలు ఊపందుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా, గాల్లో తుపాకులు పేల్చినా ప్రజలు వెరువక వెంటబడి తరిమి తరిమి కొట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు.
Meanwhile in POJK
Full on revolt pic.twitter.com/IocFtkQmEc
— Gaurav Pradhan 🇮🇳 (@OfficeOfDGP) May 12, 2024