Friday, December 20, 2024

మతాల మధ్య చిచ్చుపెట్టడమే బిజెపి పని: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో టిఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహచర మంత్రి మల్లారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ భారీ రోడ్ షో ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.  మతాల మధ్య చిచ్చుపెట్టడమే బిజెపి పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News