Wednesday, January 22, 2025

పదో తరగతి పరీక్షలో ఇక ఆరు పేపర్లే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తొమ్మిది, పదోతరగతి పరీక్షా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇది అమలులోకి వచ్చింది. తొమ్మిది, పదోతరగతి పరీక్షలను ఇక ఆరు పేపర్లతో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షకు 80, ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించారు. సైన్స్ పేపర్‌లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి పరీక్షకు 40 మార్కులు చొప్పున, ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌కు 10 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు 600 మార్కులతో పరీక్షలు నిర్వహిస్తారు.

సైన్స్ మినహా ఇతర అన్ని పేపర్ల పరీక్షా సమయాన్ని 3 గంటలు గా నిర్ణయించారు. సైన్స్ పేపర్‌కు మాత్రం 3 గంటల 20 నిముషాలుగా నిర్నయించారు. ఇందులోనూ ఫిజికల్ సైన్స్‌కు ఒక గంట 30 నిముషాలు, బయాలజీ పేపర్‌కు ఒక గంట 30 నిముషాలు గా నిర్ణయించారు. 20 నిముషాలు పేపర్‌లను కలెక్ట్ చేసుకోడానికి అదనంగా ఇచ్చారు. కాంపోజిట్ కోర్సులకు సంబంధించి 3 గంటల 20 నిముషాలుగా పరీక్ష సమయాన్ని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పదోతరగతి వార్శిక పరీక్షలను 11 పేపర్ల నుంచి ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా తొమ్మిది, పది తరగతులకు ఆరేసి పేపర్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News