- Advertisement -
జుక్కల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో
10వ తరగతి గణిత ప్రశ్నలు లీకేజ్ కలకలం
మన తెలంగాణ/ బాన్సువాడ: కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి గణిత ప్రశ్నలు లీకేజ్ కలకలం సృష్టించింది. గణితం ప్రశ్న పత్రంలోని 13, 14, 15, 16, 17 ప్రశ్నలను ఓ విద్యార్థి కాగితంపై రాసి వాటర్ మ్యాన్ సహకారంతో బయటకు పంపించాడని తెలిసింది. ఆ వాటర్ మ్యాన్ దానిని ఆ విద్యార్థి తండ్రికి అప్పగించగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటనపై విచారణ చేపట్టిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, అడిషినల్ ఎస్పీ నరసింహ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జుక్కల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. కాగా పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్టమెంట్ అధికారిని సస్సెండ్ చేసినట్లు తెలిసింది.
- Advertisement -