న్యూస్‌డెస్క్: రెండవ తరగతి చదువుతున్న తమ కుమారుడు తమను అమ్మీ, అబ్బూ(అమ్మ, నాన్న)అంటూ పిలుస్తున్నాడని, దీంతో మతపరమైన తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక హిందూ జంట ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 2వ తరగతి ఇంగ్లీష్ బుక్‌లోని టూ బిగ్ టూ స్మాల్ అనే పద్యం చదివి తమ పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడంటూ ఆ దంపతులు ఫిర్యాదు చేశారు. తాను పెద్దపిల్లనా లేక ఇంకా చిన్నపిల్లనా అనే సందేహంను అనే బాలికకు రావడం గురంచి ఈ పద్యంలో ఉంటుంది.
అదే విధంగా ఈ పద్యంలో తాతను దాదూ అని, అవ్వను దాదీ అని సంబోధించినట్లు ఉంటుంది. ఈ పద్యం చదివినప్పటి నుంచి తన కుమారుడు తనను అబ్బూ అంటూ పిలుస్తున్నాడని, తన భార్యను అమ్మీ అంటున్నాడని మనీష్ మిట్టల్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఒక వారంలోజుల్లో దీనిపై నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాధికారిని కలెక్టర్ ఆదేశించారు.