Sunday, January 19, 2025

గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎన్ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. రాజేష్ ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత గుండెలో నొప్పిగా ఉన్నట్టు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పాడు. తక్షణమే స్పందించిన వారు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News