Wednesday, November 6, 2024

‘హైదరాబాద్స్‌ గాట్‌ టాలెంట్‌’ పోటీలను నిర్వహించిన క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌

- Advertisement -
- Advertisement -

దేశంలో సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ స్కూల్‌ క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌ ఇప్పుడు జాతీయ స్ధాయి ‘హైదరాబాద్స్‌ గాట్‌ టాలెంట్‌ షో’ తుది రౌండ్‌ను 17 డిసెంబర్‌ 2022న హైదరాబాద్‌లోని హోటల్‌ ఆదిత్య పార్క్‌ వద్ద నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. నవంబర్‌లో జరిగిన ఆడిషన్స్‌లో భారీ సంఖ్యలో విద్యార్ధులు నమోదు చేసుకోగా 200 మంది విద్యార్ధులు తుది రౌండ్‌కు తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో తామెంచుకున్న విభాగాలలో ప్రవేశించారు. ఈ టాలెంట్‌ షోలో విభిన్నమైన కార్యక్రమాలైనటువంటి ఫ్యాషన్‌ షోలు, టాలెంట్‌ షోలు, డూడ్లింగ్‌, స్టోరీ వీవింగ్‌ మొదలైనవి జరిగాయి. ఈ పోటీలను కిండర్‌ గార్డెన్‌ నుంచి 8వ తరగతి విద్యార్ధులు అంటే 3–14 సంవత్సరాల లోపు బాల బాలికల కోసం నిర్వహించారు. దేశంలో ఔత్సాహిక ప్రతిభావంతులు తమ ప్రతిభను వెల్లడించేందుకు ఓ వేదికగా టీసీఓ1 నిలిచింది.

ఈ కార్యక్రమం ఓ భారీ వేదికపై జరిగింది. పాఠశాల విద్యార్ధులతో పాటుగా తమ హాబీలు, ఆసక్తిని అనుసరించి తమ నైపుణ్యాలను ప్రదర్శించుకోవాలని ఉవ్విళ్లూరే విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలు విభిన్నమైన అంశాలలో జరిగాయి. డ్రాయింగ్‌, పెయింటింగ్‌,సింగింగ్‌, మార్కెటింగ్‌, ఫ్యాషన్‌, విద్యార్ధుల క్రియేటివ్‌ స్కిల్స్‌ వంటి అంశాలలో తమ సత్తా చాటుకునే అవకాశం వారికి కలిగింది. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటుగా ప్రొఫెషనల్‌ కెరీర్‌గా మలుచుకోవాలనుకునే చిన్నారులకు అత్యుత్తమ వేదికగా ఇది నిలుస్తుంది. దేశంలో సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ విద్యావ్యవస్ధ, ద క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌ టీమ్‌తో పాటుగా ఫౌండర్లు సైతం దేశంలో అతిపెద్ద టాలెంట్‌ షో లో పాల్గొన్నారు.

ద క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌ ఫౌండర్‌, డైరెక్టర్‌ దివ్య జైన్‌ మాట్లాడుతూ ‘‘విద్యార్ధులు తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునే ఓ వేదికను అందించాలన్నది ఈ షో యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పోటీల రిజిస్ట్రేషన్స్‌, ఆడిషన్స్‌కు ఎంట్రీల రూపంలో అపూర్వ స్పందన లభించింది. దేశంలో విభిన్న ప్రాంతాల విద్యార్ధుల నుంచి ఈ తరహా స్పందన లభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ ఫైనల్‌ రౌండ్‌ హైదరాబాద్‌లో అత్యంత ఆసక్తిగా సాగింది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశపు ఔత్సాహిక సూపర్‌స్టార్లు వెలుగులోకి రాగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News