పుణె: మహారాష్ట్రలోని యరవాడ కేంద్ర కార్యాలయం ఖైదీలు తయారుచేసిన పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యరవాడ జైలు ఖైదీలు వినాయక విగ్రహాలు తయారుచేయడం ఇదే మొదటిసారని, వీరు తయారు చేసిన వినాయక మట్టి విగ్రహాలను జైలు ఇండస్ట్రీ రిటైల్ షాపులో అమ్మకానికి ఉంచామని జైలు అధికారులు శనివారం తెలిపారు. యరవాడ జైలు ఖైదీలు తయారుచేసిన వుడెన్ ఫర్నీచర్, కార్పెట్లు, టవల్స్, చెప్పులు, కళాకృతులు, వస్త్రాలను కూడా రిటైల్ షాపులో ప్రదర్శనకు ఉంచినట్లు వారు చెప్పారు. ప్రతి ఏడాది నాసిక్ సెంట్రల్ జైలు ఖైదీలు వినాయక విగ్రహాలు తయారుచేస్తారని, కాని ఈ ఏడాది మొట్టమొదటిసారి యరవాడ కేంద్ర కారాగారంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ ప్రారంభించామని వారు తెలిపారు. ఇందుకోసం నాసిక్ జైలుకు చెందిన విగ్రహాల తయారీ తెలిసిన ఇద్దరు ఖైదీలను ఇక్కడకు రప్పించామని వారు వివరించారు. విగ్రహాల తయారీపై యరవాడ జైలుకు చెందిన 15 మంది ఖైదీలకు వారు శిక్షణ ఇచ్చారని యరవాడ జైలు సూపరింటెండెంట్ రాణి భోస్లే తెలిపారు.
”యరవాడ” ఖైదీలు సృష్టించిన మట్టి గణేశులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -