Sunday, December 22, 2024

మట్టి విగ్రహాలు మేలు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 18న వినాయక చవితి పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా ప్రజలు నిర్వహించుకోనున్నారు. ఈ పండుగను భిన్న మత, కుల, జాతి, ప్రాంత వర్గ ప్రజలు అత్యంత ఆనందంగా నిర్వహించుకుంటారు. ‘భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వం’ అని చాటి చెప్పేలా ఈ పండుగను ప్రతీ ఒక్కరు సెలెబ్రేట్ చేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట గణేశ్ మహరాజ్ ఉత్సవాలను పెద్ద ఎత్తు నిర్వహిస్తారు. అసలు ఈ వినాయక చవితికి ఉన్న చారిత్రక నేపథ్యమేంటి? అనేది నేటి యువతకు పూర్తిగా తెలియదు. కేవలం సంబురాలు నిర్వహించుకునేందుకు వచ్చే సాంస్కృతిక వారసత్వ పండుగ గణేశ్ చతుర్థి అని అనుకుంటారు. కానీ, ఈ ఫెస్టివల్‌కు ఘనమైన హిస్టరీ ఉందండోయ్.. స్వాత్రంత్య్రోద్యమ కాలంలో ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ భారతీయుల వాక్ స్వాతంత్య్రాన్ని హరించేసిన సందర్భమది. అప్పుడు సభలు, సమావేశాలకూ అనుమతుల్లేవ్. కఠినమైన నియమ నిబంధనలు బ్రిటీష్ పాలకులు విధించారు. ఈ క్రమంలోనే జలియన్ వాలా బాగ్‌లో సమావేశమైన భారతీయులను కాల్చి చంపేశారు. ఈ క్రమంలోనే రౌలత్ చట్టం తీసుకొచ్చారు.

అలాంటి సమయంలో స్వాతంత్య్రోద్యమ నాయకులు బాల గంగాధర తిలక్ ‘మేము గణేశ్ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉత్సవాలు నిర్వహించుకుంటాం’ అని పేర్కొంటూ నాటి బ్రిటీష్ సర్కార్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. అయితే, అలా అనుమతులు పొందడం వెనుక తిలక్ ఉద్దేశం వేరుగా ఉంది. అది బ్రిటీష్ పాలకులు కనిపెట్టలేకపోయారు. అనుమతులతో వినాయక చవితి ఉత్సవాలకు జనం భారీగా పోగవడం జరిగింది. ఆ సందర్భంలో ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ కాంక్షను బలోపేతం చేసే విధంగా ప్రేరేపించారు తిలక్. అలా గణేశ్ మండపాలలో ప్రజలను చైతన్యపరచడంతో పాటు స్వాతంత్య్రం కోసం ఏం చేయాలి? ఏం చేస్తే స్వాతంత్య్రం సిద్ధిస్తుంది? అనే దిశగా చర్చలు జరిపేవారు. నాయకులు, ప్రజలు ఎలా కలిసికట్టుగా ముందుకు సాగాలి? అనే అంశాలపై వినాయక విగ్రహ మండపాల వద్ద చర్చించుకునేవారు. అలా దేశ ప్రజల్లో సమిష్టితత్వాన్ని, సంఘటిత తత్వాన్ని పెంపొందించే దిశగా వినాయక చవితి పర్వదినాలు చరిత్రలో నిలిచిపోయాయి. కుల, మత, ప్రాంత,

జాతి, వర్ణ విభేదాలు లేకుండా జనం అందరూ పోగై స్వాతంత్య్రోద్యమ కాంక్షను బలపరిచారు. స్వాత్రంత్య్రం కోసం దేశ నాయకులు చేసిన త్యాగాలు, పోరాటం వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అలా ఆ‘నాడు’ ప్రారంభమైన ‘గణపతి బప్పా మోరియా’ ఉత్సవాలు నేటికీ వైభవోపేతంగా, దేదీప్యమానంగాకొనసాగుతున్నాయి.నిజానికి ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా జనంలో సంతోషం కలుగుతోంది. కానీ, పోటీపడి మరీ భారీ విగ్రహాలు ప్రతి చోట పెట్టడం సబబేనా? అనే దిశగా ప్రజలు, నాయకులు ఆలోచన చేయాలి. అందరూ కలిసి ఒకే చోట ఆనందంగా వేడుకలు జరుపుకునే విధంగా నిర్వహణ ఉంటే బాగుంటుందా? అనేది పరిశీలించాలి. ప్రభుత్వం సైతం ఈ దిశగా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించాలి. ఎందుకంటే శ్రుతి మీరిన శబ్ద, వాయు, పర్యావరణ కాలుష్యం వల్ల భవిష్యత్ తరాలకు మాత్రమే కాదు ప్రస్తుత మానవ జాతికి మనుగడ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. దాంతో పాటు అన్ని చోట్ల పర్యావరణానికి హాని కలిగించబోని ‘మట్టి విగ్రహాలు’ ప్రతిష్టించేలా ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News