Thursday, January 9, 2025

గ్యాస్ స్టవ్‌పై మట్టి కుండ ప్రమాదం.. సోషల్ మీడియాలో వైరల్‌

- Advertisement -
- Advertisement -

ఇటీవలి కాలంలో మహిళలు పాత పద్ధతిలోనే వంటలు చేస్తున్నారు. కానీ మా అమ్మమ్మల పద్ధతిలో వండడం మంచిదే కానీ, ఎలా వండుకోవాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక పోతే తప్పని ఆపదలు తెచ్చిపెడతాయి. అలాంటి ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది.

ఫుడ్ బ్లాగర్ ఫర్హా ఆఫ్రిన్ సాంప్రదాయ భారతీయ శైలిలో వండాలనుకుంటున్నారు. అందులో భాగంగా మట్టి కుండను పొయ్యిపై పెట్టారు. అందులో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. కుండ విరిగి చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వీడియోను షేర్ చేస్తూ.. అలాంటి పరిస్థితి ఎదురుకావద్దని అఫ్రీన్ ఘాటుగా హెచ్చరించింది.

తనలాగే ప్రయత్నించాలనుకునే వారు చెఫ్‌లు లేదా పెద్దలను సలహాలు అడిగి మరీ ప్రయత్నించాలని అఫ్రిన్ సూచిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లలో ఒకరు మట్టి కుండల్లో చేయాలనుకుంటే పెద్దలను అడగాలని సలహా ఇవ్వగా, మట్టి కుండలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆరిన తర్వాత ఉడికించాలని మరొకరు సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News