Sunday, December 22, 2024

ఆరోగ్యానికి మట్టికుండ!

- Advertisement -
- Advertisement -

Clay Pot for Health Benefits

రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఎండ తీవ్రత నుండి రాగానే తక్షణమే కూలింగ్ ఇచ్చే ఫ్రిజ్‌లకు వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వలన మట్టి కుండలకు, మట్టి సీసాలకు, మట్టి పాత్రలకు ఆదరణ తగ్గుతుంది. కాలానుగుణంగా మట్టి కుండలు వాడడం తగ్గించారు. ఒకప్పుడు మట్టి పాత్రలతో మన జీవితాలు మమేకమై ఉండేవి. ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలితో స్టీల్, ప్లాస్టిక్, పింగాణీ పాత్రలు వచ్చేశాయి. మన ప్రాంతాలలో ఇక మట్టి కుండలను వాడడం మార్చిపోయారు నేటితరం. ఫ్రిజ్‌లు వచ్చాక.. వీటిని పక్కన పెట్టేశారు. పూర్వకాలంలో నీళ్ళను ఈ మట్టి కుండలలోనే నిల్వ చేసి తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎండాకాలం వచ్చిదంటే కేవలం ఫ్రిజ్ మంచి నీటి మాత్రమే తాగుతున్నారు. ఈ వేసవి కాలంలో అలా చల్లటి నీటిని తాగడం వల్ల వెంటనే శరీరానికి చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నా యి. ఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు పడిపోతుంది.

గొంతు నొప్పితో పాటు జలుబు చేసే అవకాశం ఉంటుంది. మట్టి కుండలో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో అక్కడక్కడా ఇప్పటికీ మట్టి కుండలో నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలం ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నా అంత పెద్దగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అలాగే ఇటీవల కాలంలో మట్టి పాత్రలతో పాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన మనకు కలిగే ఆరోగ్యానికి మంచిదని పలువురు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నేటి కాలంలో భారతదేశంలోని వడదెబ్బ ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య. వేసవికాలంలో చాలా మంది వడదెబ్బకు గురవుతుంటారు. మట్టి కుండలోని నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటుం ది. అదే విధంగా మన శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయ పడతాయి. మట్టి కుండలో మంచి నీరు తాగడం వలన మన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే మట్టి కుండలు కొనుగోలు చేసి మంచి నీళ్లు తాగేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడ చూసినా అంతంత మాత్రమే కనిపిస్తుంది.

మట్టి కుండలు పాత్రలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని వినియోగించే వారు కరువయ్యారు. వేసవిలో మట్టికుండలకు ఎక్కువగా గిరాకీ ఉండేది. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరూ మట్టి కుండలను వినియోగించేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ లోని చల్లటి మంచి నీళ్ళను అలవాటు పడ్డారు. మట్టి కుండలోని నీరు మంచిదని ఆరోగ్యాన్నిస్తుందని చెబుతున్నా, ఫ్రిజ్ లోని చల్లని నీరు కనబడగానే అటు వైపే మొగ్గు చూపుతున్నారు. మన ముందు తరాలు మట్టి పాత్రలో ఆహార పదార్థాలు వండడం, మట్టి కుండలోని మంచినీరు తాగడం, మట్టి పాత్రలో భోజనం చేసేవారు. వీటి వినియోగం ఆరోగ్యంగా ఉండేవారని గ్రహించారు. ఎండా కాలం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ఎండలు మాత్రం బీభత్సంగానే కొడుతున్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇంకా ఏప్రిల్, మేలో ఎలా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎండా కాలం అంటే అందరికీ ఎక్కువగా చల్లని నీరు గుర్తుకు వస్తుంది. ఒక్కసారి బయటకి వెళ్లి వస్తే చాలు ఎన్ని సీసాలు అయిన మంచినీరు గడగడ తాగేస్తున్నారు.

అయితే ఈ సమయంలో ఫ్రిజ్‌లోని మంచినీరు కంటే కుండలోని మంచి నీరు తాగడమే ఉత్తమం అని అంటున్నారు నిపుణులు. కుండలోని మంచి నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పలువురు నిపుణు లు అంటున్నారు. కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్ చేసిన నీటితో సమానం. కుండలోని నీళ్ళు తాగడం వలన దగ్గు, జలుబు అసలుకే రావు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, గొంతు నొప్పి ఉండదు. మట్టి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి శక్తి అందజేస్తాయి. వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. వేసవిలో మన దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. వేసవి కాలంలో కాసేపు బయట తిరిగినా, వడగాలులు మన శరీరాన్ని తాకినా వడదెబ్బ తగలడం సహజం.

అలా జరగకూడదంటే మట్టి కుండలోని నిల్వ చేసిన నీరు తాగడం మంచిదంటున్నారు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి. కానీ ఫ్రిజ్ నీళ్లు అప్పటికపుడు చల్లదనాన్ని ఇస్తాయేమో కానీ తరువాత శరీరానికి వేడి కలుగజేస్తాయి. అయితే దిగువ తరగతి కుటుంబాల్లో వేసవిలో మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుని తాగడం వలన వేసవిలో సాధారణం. ఒకప్పుడు ప్రతి ఇంట్లో స్థాయి అంటూ తేడా లేకుండా మట్టి కుండలు ఉండేవి. అందరూ అందులోనే నీళ్లు తాగేవారు. కాలం మారుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మట్టి కుండలను మూల పెట్టి ఫ్రిజ్జులను వాడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే సగటు నిరుపేద ప్రజలకు గుర్తొచ్చేది మట్టి కుండలే. అయితే మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల చల్లదనం మాత్రమే కాదు. వాటితో ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడుతుంది. మట్టి కుండ అనేది సహజ సిద్ధంగా నీటిని చల్లబరుస్తుంది. అలాగే ఈ నీటికి రుచి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా కుండలో నీళ్లు తాగడం ఇప్పుడే నుండే తాగండి. ఆరోగ్యానికి కాపాడుకోండి.

* లకావత్ చిరంజీవి నాయక్- 99630 40960

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News