Wednesday, January 22, 2025

మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : జన జీవనానికి మూలధారామైన గాలి, నీరు స్వచ్ఛమైనవిగా అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృషి చేశారని జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన మంచినీళ్ల పండుగ కార్యక్రమాని నిర్వహించారు. ఆదివారం ఉదయం కానాయపల్లి మిషన్ భగీరథ జల శుద్ధి కేంద్రం వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షత వహించగా జెడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ మానవాళికి గాలి, నీరు జీవనాధారమన్నారు.

ఇలాంటి జీవనాధారం కలిగిన గాలి, నీరు పరిశుభ్రంగా అందించడానికి ముఖ్యమంత్రి తెలంగాణకు హరితహారం, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుద్ధమైన మంచినీరు అందిస్తున్నారని, తెలంగాణ ఏర్పడక ముందు మంచినీళ్ల కోసం ప్రతి రోజు ఇబ్బందులు ఉండేవని, నేడు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు నల్లా ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ మంచినీళ్ల సమస్య ఎక్కడైనా ఉందా అని తెలుసుకోవడానికి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామాలలో పర్యవేక్షిస్తుంటానని అన్నారు. మిషన్ భగీరథ సమస్యలు పరిష్కరించడానికి గ్రామానికి ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంటారని, అవసరమైతే గ్రామ పంచాయతీ నిధులు వాడుకోవచ్చని తెలిపారు.

వనపర్తి జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందించడంలో మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది ముఖ్యంగా సూపరిండెంట్ ఇంజనీర్ జగన్‌మోహన్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఇంట్లో నీళ్లు రావనే పరిస్థితి నుంచి ఇంటింటికి మిషన్ భగీరథ త్రాగునీరు వస్తుందనడానికి సంతోషిస్తున్నానన్నారు.

వనపర్తి జిల్లాకు సమీప భవిష్యత్తులో శంకర సముద్రం, రంగ సముద్రం, జురాల ఎండి ఎంతటి కరువు వచ్చిన తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందుచూపుతో కృష్ణానది, ఎల్లూరు రిజర్వాయర్ నుండి వనపర్తికి త్రాగునీరు తీసుకువస్తున్నట్లు తెలిపారు. బొగ్గుపల్లి తండా వద్ద 75 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించడం వెనుక ఎంత ఇబ్బందులు, శ్రమ దాగి ఉందో ప్రజలు గ్రహించాలని తెలిపారు. 2690 కిలోమీటర్ల గ్రిడ్ లైన్ 1757 కిమీ ఇంట్రా పైన్ లైన్ ద్వారా జిల్లాకు త్రాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సిపల్ చైర్మెన్ సుఖేశిని, పెబ్బేరు మున్సిపల్ చైర్మెన్ కరుణ శ్రీ, ఆత్మకూరు మున్సిపల్ చైర్మెన్ గాయత్రి, చిన్నంబావి జెడ్పిటిసి శివరంజని, మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీధర్ సైతం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, సింగిల్ విండో డైరెక్టర్లు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News