Saturday, December 21, 2024

శుద్ధిపేటగా మార్చుకున్నాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Clean siddipet by Harish Rao

సిద్ధిపేట: సిద్ధిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారుని పట్టణం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందిందని, సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం ఉదయం పట్టణంలోని 14వ వార్డులో ప్రజా అవసరాల రీత్యా నిత్యం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో పాదాచారుల భద్రత కోసం ఫుట్ పాత్ నిర్మాణం, అలాగే 14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వరద కాలువ, సిసి రోడ్డు, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి  హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఇంటింటా నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్తలో పొడి చెత్త రీ సైక్లింగ్ చేస్తున్నట్లు, నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నట్లు, 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రీయ జీవ ఎరువు తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇప్పటి వరకూ 2522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సిఎన్జీ గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు తయారైందని మంత్రి చెప్పారు.  దీంతో బుస్సాపూర్ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగిపోయాయని, జీరో ల్యాండ్ ఫిల్ పట్టణమే లక్ష్యంగా కృషి చేయడంతో ఫలితాలు వస్తున్నాయని, ప్రజల భాగస్వామ్యంతో నెరవేరుతున్నాయని మంత్రి ప్రశంసించారు. పట్టణంలో అవసరమైన చోట రోడ్లు, ఫుట్ పాత్, అవసరమైన చోట మురికాల్వలకు రూ.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని, 14వ వార్డులో సిసి రోడ్లు, మురికి కాల్వలకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నామని, ఈ వార్డులో వరద కాలువ, ఫుట్ పాత్ పొడవు 1.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేటలో అన్నీ రకాల వైద్యం ప్రజలకు అందుబాటులో ఉందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంత ఇంటి స్థలం ఉంటే రాబోయే రోజుల్లో రూ.3 లక్షలు మంజూరు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు, 57 ఏళ్లు దాటినా వృద్ధులకు ఫించన్లు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News