ఇల్లందు : మిషన్ భగీరథ పథకంతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందుతుందని స్థానిక ఎంఎల్ బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఇల్లందులపాడులో నిర్వహించిన మంచినీళ్ళ పండగ కార్యక్రమానికి హజరై మాట్లాడారు.
సమైక్యరాష్ట్రంలో తాగునీటికోసం అనేకరకాల ఇబ్బందులు పడ్డామని, సాధించుకున్న స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన మిషన్‌భగీరధతో ప్రతిపల్లెకు, పట్టణాలకు నీటి సౌకర్యం అందుతుందన్నారు. ప్రజలకు పూర్తిస్ధాయిలో మంచినీరు అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. అనంతరం ఆప్రాంతంలో మిషన్‌భగీరధ పంపులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ అంకుషావళి, మిషన్‌భగీరధ డిపిఎమ్ విజయ్, మున్సిపల్ కౌన్సిలర్‌లు కటకం పద్మావతి, వాంకుడోత్ తార, వార రవి, అంకెపాక నవీన్, కుమ్మరి రవీందర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.