Monday, December 23, 2024

స్వచ్ఛ సర్వేక్షణ్ అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

నర్సాపూర్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 స్వచ్ఛ భారత్ మిషన్‌లో అందరూ భాగస్వాములు కావాలని, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం పురపాలక సంఘం నర్సాపూర్ ఆధ్వర్యంలో బివిఆర్‌ఐటిలో, అర్బన్ – సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో భాగంగా, పారిశుద్ధ్య పనులు అనగా తడి పొడి హానికర వ్యర్ధాలను ఇంటింటి నుండి సేకరణ, వాటిని తిరిగి ఉపయోగించు పద్ధతి అనగా రెడ్యూస్ రియూస్ రిసైకిల్ (ఆర్‌ఆర్‌ఆర్) విధానం, మురికి కాలువలు మరియు కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కలెక్టర్ హాజరైన్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ సదస్సు, స్థానిక బివిఆర్‌ఐటి కళాశాల యందు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వి.శ్రీనివాసులు, తహశీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, బివిఆర్‌ఐటి విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్థులు, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News