Monday, December 23, 2024

‘వంద’ చెల్లిస్తే వితౌట్ మాస్క్ చలాన్ క్లియర్

- Advertisement -
- Advertisement -

Clear Without Mask Challan if you pay 100 rupees

పెండింగ్ చలానాలకు భారీ డిస్కౌంట్
మార్చి 1 నుంచి 30 వరకు స్పెషల్ డ్రైవ్
ఆన్‌లైన్ మోడ్ చలాన్‌ల చెల్లింపులు

మనతెలంగాణ/హైదరాబాద్ : మూడు కమిషనరేట్ల పరిధిలో రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు విధించిన -పెండింగ్ చలాన్‌లతో పాటు కరోనా సమయంలో మాస్క్ లేకుండా చలాన్లు పడిన వారికి పోలీసులు ఊరట కల్పించారు. ఈక్రమంలో కరోనా సమయంలో రహదారులు, షాపింగ్ మాల్స్, పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లలో మాస్క్ లేకుండా చలాన్లు పడిన వాహనదారులు, పాదాచారులు రూ. 100 రూపాయలు చెల్లిస్తే వితౌట్ మాస్క్ చలాన్ క్లియర్ చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకోసం మార్చి 1 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చలాన్‌ల చెల్లింపులను ‘ఈ-లోక్ అదాలత్’ నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాగా వాహన చోదకులకు పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల క్లియరెన్స్‌కు పోలీసు శాఖ భారీ రాయితీలు ప్రకటించింది. టూ, త్రీ వీలర్లు, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ, కార్లకు 50%, భారీ వాహనాలకు 80% రాయితీ ప్రకటించింది. కాగా మార్చి 1వ తేదీ నుంచి 31 వరకు ఈ-చలానాల వెబ్‌సైట్(https://echallan.tspolice.gov.in/publicview) లో చెల్లించే విధంగా పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తున్నారు.

అయితే పెండింగ్ చెలానా చెల్లింపు సొమ్ముకు సర్వీస్‌ఛార్జ్ రూ. 35 అదనంగా వసూలు చేయనున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో గత ఎనిమిదేళ్లుగా వాహనదారులు చెల్లించని జరిమానా రూ.600 కోట్లకు చేరినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఒక సారి తగ్గింపు రాయితీని అందించనున్నట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత 2 సంవత్సరాలలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నందున, మానవతాదృక్పధంతో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను కలిగి ఉన్న వారందరికీ అవకాశం ఇచ్చినట్లు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లలో దాదాపు 85 సొసైటీలోని మధ్య, దిగువ మధ్య, పేద వర్గాలకు చెందిన 2 చక్రాల వాహనాలు, ఆటోలకు సంబంధించినవి కాబట్టి వాహన యజమానులు, డ్రైవర్‌లకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఇదిలావుండగా ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు 25% చెల్లిస్తే, మిగిలిన 75% పెండింగ్‌లో ఉన్న చలాన్లు మాఫీ చేయబడతాయి. పుష్ కార్ట్‌లు, చిన్న విక్రయదారులకు 39బి కేసులు 20% చెల్లించినట్లయితే, మిగిలిన 80% మాఫీ చేయనున్నారు. లైట్ మోటర్ వెహికిల్ లు, కార్లు, జీప్‌లు, భారీ వాహనాలకు 50% బ్యాలెన్స్ చెల్లిస్తే 50% మాఫీ, ఆర్‌టిసి బస్సులకు 30% బ్యాలెన్స్ చెల్లిస్తే 70% పెండింగ్ చలాన్ మొత్తం మాఫీ చేయబడుతుందని వివరిస్తున్నారు. కాగా ఈ చెల్లింపులన్నీ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలని, ముఖ్యంగా ట్రై కమిషనరేట్‌లలో చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం ఇవ్వడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News