సీతారామ ఎత్తిపోతలకూ సాంకేతిక
అనుమతి కేంద్ర ప్రభుత్వానికి
జలసంఘం సిఫారసు సీతమ్మ
సాగర్‌కు 67టిఎంసిల కేటాయింపు
రాష్ట్ర విభజన తరువాత ఈ రెండు
ప్రాజెక్టులకు అనుమతి లభించడం
విశేషం భద్రాద్రి, ఖమ్మం,
మహబూబాబాద్ జిల్లాకు తాగు, సాగు
నీరు అందించనున్న ప్రాజెక్టులు ఇది
ప్రభుత్వ విజయం :డిప్యూటీ సిఎం భట్టి
మన తెలంగాణ/ హైదరాబాద్ : సీతమ్మసాగర్ ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకం(ఎస్‌ఆర్‌ఎల్‌ఎస్) లకు కేంద్ర జలసంఘం(సిడ బ్లూసి) సాంకేతిక అనుమతులు ఇచ్చింది. గురువారం న్యూఢిల్లీలో జ రిగిన 158వ సాంకేతిక సలహా కమిటీ (టిఎసి) సమావేశంలో ఈ మేరకు సిఫార్సు చేసింది. కేంద్ర జలసంఘం సెక్రెటరీ దేవశ్రీ ము ఖర్జీ, కేంద్ర జలసంఘం చైర్మన్ డాక్టర్ ముఖేష్ కుమార్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతమ్మ సాగర్, సీతారామ ఎత్తిపోతల పథకం(ఎస్‌ఆర్‌ఎల్‌ఎస్) సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా సాగునీటితో పాటు హైడ్రో పవర్ ఉత్పత్తిని కలిగి ఉండే బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులకు అనుమతులు లభించడం గమనార్హం.
ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిరాహుల్ బొజ్జ, ఈఎన్‌సి జి.అనిల్ కుమార్, కొత్తగూడెం సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సీతారా మ ప్రాజెక్టు ద్వారా 67.05 టిఎంసి నీటితో దాదాపు 7,87,000 ఎకరాల ఆయకట్టు, త్రాగునీటి అవసరాలు తీరనున్నాయి. పదకొం డు పంప్ హౌజ్‌ల ద్వారా,757 మెగావాట్ల విద్యుత్ లోడ్‌తో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు మేలు కలగనుంది. ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయింపులు, సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు కావడం రాష్ట్ర ప్రభుత్వ విజయమని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ద్వారా ఖమ్మం జిల్లాలోని వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని ఆయన తెలిపారు. ఇందుకు నిరంతరం కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అభినందనలు తెలియజేశారు.